హైదరాబాదు : ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్.
2018 నుండి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టిన భాను ప్రకాష్
ఏపీ – రాయచోటికి చెందిన భాను ప్రకాష్..
అంబర్‌పేట్ పీఎస్‌లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వహణ.
ఏపీలో ఎలక్ట్రిక్ ఏఈ ఉద్యోగం వచ్చిందని రిలీవ్ చేయాలని కోరిన భాను ప్రకాష్.. వెపన్ డిపాజిట్ కోరడంతో బయటపడ్డ ఉదంతం.
ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4.3 తులాల బంగారాన్ని ఓ దుకాణంలో కుదువ పెట్టిన భాను ప్రకాష్.
లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమై, యజమాని బంగారం తిరిగి అడగగా, కనిపించడం లేదని చెప్పిన ఎస్ఐ.
దీంతో విచారించి ఆ దుకాణం నుండి బంగారాన్ని రికవరీ చేసి, భాను ప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.
2018 నుండి బెట్టింగ్‌లకు అలవాటై భాను ప్రకాష్ రూ.కోటిన్నర పోగొట్టినట్లు, ఈ క్రమంలోనే సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టినట్లు తెలిపిన పోలీసులు.
Sidhumaroju




