మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియాలో , మరియు సికింద్రాబాద్ రైతీఫైల్ బస్టాండ్ ఏరియాలో విద్యాలయాలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల మధ్యలో వైన్స్ షాపు మరియు సిట్టింగ్ రూంలు పెడుతుండడంతో అందరికీ ఇబ్బందులు ఎదురు కానున్న దృష్ట్యా ఆయా ప్రాంతాల నుంచి మహిళలు,కాలనీల పెద్దలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ని పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అక్కడ వైన్స్ షాపు ఏర్పాటును నిలిపివేయాలని మహిళలు విజ్ఞప్తి చేయడంతో సంబధిత ఎక్సైజ్ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంటనే మాట్లాడడంతో అధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అక్కడ వైన్స్ ఏర్పాటు చేయకుండా చూస్తామని హామిఇచ్చారు.
Sidhumaroju




