మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఆర్టీసీ కాలనీలో రూ.18 లక్షలతో, శివానగర్‌లో రూ.32 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. కాలనీ అభివృద్ధికి ఇవి తోడ్పడనున్నాయని పేర్కొన్నారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, శోభన్, శరణ్‌గిరి, సురేష్, సయ్యద్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju






