మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం నేరుగా ప్రజలకు చేరేలా ఎమ్మెల్యే ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:
బాలాజీ యాదవ్ (అల్వాల్ డివిజన్) – రూ. 37,500
నవీన్ రాజు (అల్వాల్ డివిజన్) – రూ. 13,500
వాణి (వినాయక్ నగర్ డివిజన్) – రూ. 11,500
షేక్ జిలాని (మచ్చ బొల్లారం డివిజన్) – రూ. 21,000
ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎంతో మందికి ఆశగా నిలుస్తోందని తెలిపారు. మరింత మంది లబ్ధిదారులకు కూడా ఈ సహాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బద్దం పరశురాం రెడ్డి, నాయకులు డోలి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju






