Tuesday, January 13, 2026
spot_img
HomeSouth ZoneTelanganaపూలే వర్ధంతి: బీఆర్ఎస్ నాయకుల నివాళి |

పూలే వర్ధంతి: బీఆర్ఎస్ నాయకుల నివాళి |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిజాంపేట్ >  భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు విశేషంగా కృషి చేసి, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) పరిధిలోని బాచుపల్లి సాయి నగర్ లో మహాత్మా ఫూలే విగ్రహానికి నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్.ఎం.సి. బి.ఆర్.ఎస్.

పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు సాంబశివరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
వారు మాట్లాడుతూ, మహాత్మా ఫూలే ఆశయాలను, ఆయన చూపిన బాటను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, అప్పుడే ఆయనకు సరైన నివాళులు అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు జలగం చంద్రయ్య,రామ్ నరసయ్య, ఆంజనేయులు,కురుమూర్తి, నర్సింగ్, నాయకురాలు భారతి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments