మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి గృహప్రవేశం నిమిత్తం వచ్చిన షేక్ సన, తిరుగు ప్రయాణం చేద్దామని ట్రైన్ కోసం సఫీల్ గూడ వెళ్లారు. అక్కడ వారికి ట్రైన్ మిస్ అవ్వడంతో బొల్లారం తుర్కపల్లి కి ఆటోలో తిరుగుప్రయాణం అయ్యారు.
వారు తీసుకువెళ్లిన అన్ని లగేజ్ బ్యాగులు ఇంట్లోకి తెచ్చుకున్నారు కానీ ఒక లగేజ్ బ్యాగు అందులో 18 తులాల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు.
ఆదివారం నాడు బ్యాగులు చెక్ చేయగా అందులో ఒక బ్యాగ్ మిస్ అయిందని అందులోనే బంగారు నగలు ఉన్నాయని గమనించి వెంటనే ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి ఆదివారం మధ్యాహ్నం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, అక్కడ విధుల్లో వున్న ఎస్సై చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించి, ఎస్.హెచ్.ఓ అల్వాల్, మరియు డీఐ తిమ్మప్ప ఆదేశాలను అనుసరిస్తూ అట్టి ఆటోను మూడు గంటల వ్యవధిలోని ట్రేస్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు రప్పించారు.
బాధితురాలుకు సంబంధించిన బ్యాగును మరియు అందులో ఉన్న 18 తులాల విలువైన బంగారు నగలను సదరు బాధితురాలికి అప్పగించారు.
ఆటోలో మర్చిపోయిన అట్టి బ్యాగును, బంగారు నగలను సదరు ఆటో డ్రైవర్ రాజేష్ బాధ్యతతో తిరిగి తెచ్చినందుకు అభినందనలు తెలియజేశారు.
అలాగే, ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్సై చంద్రశేఖర్ సదురు మహిళలకు సూచించారు. తమకు సత్వరన్యాయం అందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియచేసారు.
Sidhumaroju
