Home South Zone Telangana ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి – పాల్గొన్న ఎమ్మెల్యే.|

ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి – పాల్గొన్న ఎమ్మెల్యే.|

0
1

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ వివక్షను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి, తన కూతురిని కూడా విదేశాలలో చదివే స్థాయికి తీసుకువచ్చిన వీరవనిత ,రాజ్యాధికారం తోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని నమ్మి రాజకీయాల లోకి వచ్చి కౌన్సిలర్ గా, ఎమ్మెల్యే గా సేవలందించిన ఈశ్వరీ బాయి  107 వ జయంతి కార్యక్రమం సోమవారం సికింద్రాబాద్ లోని వారి విగ్రహం వద్ద ఈశ్వరీ బాయి  ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై ఈశ్వరీ బాయి  విగ్రహానికి ఈశ్వరీ బాయి కుమార్తె, మాజీ మంత్రి  శ్రీమతి గీతా రెడ్డి తో పాటు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, వారి సేవలను స్మరించుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ….

పేద కుటుంబంలో పుట్టి వంద ఏళ్ల కిందటే మహిళల మీద ఉన్న ఆంక్షలు, లింగ వివక్షలు ఎదుర్కొన్న వీర వనిత ఈశ్వరి బాయి అని అన్నారు.

చిన్నతనంలోనే భర్త చనిపోయినా అధైర్య పడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి, తన కూతురు కూడా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించిన ఘనత ఈశ్వరి బాయి కే దక్కిందని అన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రి బాయి పూలే ల సేవాభావం ఈశ్వరి బాయి  ప్రభావితం చేసిందని, వారి స్ఫూర్తితోనే బాలల హక్కుల కోసం, బాలిక విద్య కోసం ఈశ్వరి బాయి పాటు పడ్డారని అన్నారు.

రాజ్యాధికారంతోనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయన్న అంబేద్కర్  ఆలోచనలకు అనుగుణంగా 1951 లోనే చిలకలగూడ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచారని ,అలాగే నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఫైర్ బ్రాండ్ గా తనకు పేరు ఉందని అన్నారు. ఈశ్వరి బాయి  మహిళ, బాలల సంక్షేమ కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడే బాలికలకు ఉచిత విద్య అందించే చట్టాన్ని రూపొందించారని చెప్పారు. ఈశ్వరి బాయి  ఎంత గొప్పవారో వారి కూతురు గీతారెడ్డి  కూడా అంతే గొప్పగా తన వ్యక్తిత్వానికి వారసురాలిగా నిలిచారని అన్నారు.

విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజాసేవ చేయడం కోసం సొంత దేశానికి తిరిగి వచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, సాంఘిక సంక్షేమ, విద్య, పర్యాట,క భారీ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ప్రజాసేవ చేశారని చెప్పారు. నన్ను కూడా రాజకీయాలలో ప్రోత్సహించింది గీతారెడ్డి.  ఆమె ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు.

ఈశ్వరీ బాయి గారి గొప్పతనాన్ని, త్యాగాలను గుర్తించి వారి జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

NO COMMENTS