మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, మర్రి రాజశేఖర్ రెడ్డి భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళులర్పించారు.
ఎమ్మెల్యే ముందుగా క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు.
అనంతరం..వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ అంబేద్కర్ సర్కిల్. అల్వాల్ డివిజన్ వెంకట్రావుపేట్ అంబేద్కర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా MLA మాట్లాడుతూ…
“డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన సమానత్వం, న్యాయం, సామాజిక న్యాయం మార్గం ప్రతి భారతీయుడికి శాశ్వత స్ఫూర్తి. ఆయన ఆలోచనలు తరతరాలకు మార్గదర్శకం.” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, రేవంత్ రెడ్డి, మోసిన్, జనార్ధన్, సురేష్,అరుణ్, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు రాజు, రమేష్ సెంథిల్, ప్రేమ్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Sidhumaroju






