బహిరంగ సభకు, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు, బీడీల శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, ఎస్ మునియప్ప ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ,బి కృష్ణ,, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు
,బి రాజు ,డి శేష్ కుమార్లు వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునియప్ప, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబులు మాట్లాడుతూ,, కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా, సాధించి తెచ్చుకున్న, కార్మిక చట్టాలను, నాలుగు కోడ్లుగా, విభజించి కార్మిక ద్రోహానికి పాల్పడుతుందని వారు విమర్శించారు.
ప్రభుత్వానికి కార్మికులపై జాలి లేదని వారన్నారు. జాతీయ ఉపాధి గ్రామీణ పథకం ఉపాధి కూలీలకు సాధించి తీసుకొస్తే, ఆ పథకానికి అనేక ఆంక్షలు విధించి, కూలీలకు అందకుండా, పథకాలను నిర్వీరం చేస్తుంది ప్రభుత్వమని వారు తెలిపారు .
ప్రభుత్వానికి కార్మికులపై చిత్తశుద్ధి లేదని ,ఎప్పటికప్పుడు కార్మిక ద్రోహానికి పాల్పడే విధంగా, పరిపాలన కొనసాగిస్తున్న తప్ప, కార్మికులకు న్యాయం చేసే విధంగా పాలించడం లేదని వారు దుయ్యబట్టారు.




