Sunday, December 7, 2025
spot_img
HomeSouth ZoneTelanganaసానిటరీ ప్యాడ్స్ అవగాహన – ఉచిత పంపిణీ |

సానిటరీ ప్యాడ్స్ అవగాహన – ఉచిత పంపిణీ |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ కి ముఖ్య అతిథులుగా..తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మెంబర్ గోగుల సరిత, లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత, కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొల్లి కల్పన, సినీ నిర్మాత శ్రీ మల్లికా రెడ్డి, జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు, మరియు శిశురక్షణ.

అదేవిధంగా తెలంగాణ పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్, మరియూ భరోసా టీం, సభ్యులు ఈ కార్యక్రమానికి కి విచ్చేసి ఈ ప్యాడ్స్ వాడితే కలిగే ఉపయోగాలను బాలికలకు తెలియచేసారు.
అనంతరం శానిటరీ పాడ్స్ పంపిణి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వివిఆర్ గ్రూప్స్ చైర్మన్ అండ్ వాగ్నికా రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వెన్నమనేని
విష్ణు రావు మాట్లాడుతూ….

పిల్లలకి మంచి ఏంటి చెడు (గుడ్ టచ్, బాడ్ టచ్) ఏంటి.. అని తెలియచేసిన అథితులకు కృతజ్ఞతలు తెలియచేసారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలని అందరిలాగా ఉన్నతంగా యెదగాలని అని అయన ఆకాంక్షించారు.

అలాగే జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలకి ఈ కార్యక్రమ ముఖ్యవుద్దేశాన్ని తెలియచేసారు. ఈ కార్యమాన్ని విజయవంతంగా జరిపేలా సహకరించిన పాఠశాల యాజమాన్యాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.   Sanitary Pads Awareness VVR Trust

#Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments