మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్బంగా మెగా రక్త దాన శిబిరం కారుణ్య హాస్పిటల్ సహకారం తో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి,
యువ కాంగ్రెస్ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి, హై కోర్ట్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి, పండరి యాదగిరి మరియు కార్తీక్ రెడ్డి, మిత్రులు, మరియూ అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తండ్రి దొంతిరి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రిలాగే సేవకార్యక్రమాలు చేస్తూ కార్తీక్ రెడ్డి చిన్న వయస్సులోనే అకాల మరణం మమ్మల్ని చాలా బాధించింది
, అయినా కూడా వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు ఇలాగే సేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.
కార్తీక్ రెడ్డి మిత్రులు మాట్లాడుతూ.. కార్తీక్ రెడ్డి జ్ఞాపకాలను మరియు ప్రజలతో తను కలిసిపోయే మనస్తత్వం తలుచుకొని భావోద్వేగo చెందారు, కార్తీకరెడ్డి బౌతికంగా మా మధ్యలో లేకున్నా అతని స్ఫూర్తితో నిరంతరం సేవ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు,
ఈ కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి అభిమానులు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని 200 మంది వరకు రక్త దానం చేసారు,
ఈ రక్తదాన కార్యక్రమానికి సహకరించిన కారుణ్య హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు.
Sidhumaroju




