మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయ కార్యక్రమంలో చిన్న తోకట్ట లోని M R బాంకెట్ హాల్ లో నిర్వహించారు.
ఈ పరిచయ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, జాయింట్ సెక్రటరీ సంజీవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారి గోవింద్, ట్రెజరర్ రవీందర్ మరియు సభ్యులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ముదిరాజ్ సంఘం వారు స్థలం సమకూర్చుకుంటే ముదిరాజ్ భవన్ నిర్మాణం చేయిస్తానని అన్నారు.
నూతన కమిటీ ముదిరాజ్ సంఘ అభివృద్ధితో పాటు సమాజ సేవ చేస్తూ అందరి ఆదరాభిమానాలు పొందాలని చెప్పారు.
ఈ పరిచయ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్,పిట్ల నగేష్, ముదిరాజ్ సంఘం ఛైర్మన్ వేణుగోపాల్, సలహాదారులు సత్తయ్య,జగత్ రామ్, అశోక్ కుమార్, మారుతి గౌడ్, ఉత్తరయ్య తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju




