గుంటూరు:
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..
అంబటి రాంబాబు, మాజీ మంత్రి కామెంట్స్
శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించేందుకు వైసీపీ నాయకులు అందరం వచ్చాం..
గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జి శంకర్ విలాస్ బ్రిడ్జి.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేసేందుకు పాత బ్రిడ్జి ని కూల్చి వేశారు..
సింగిల్ పిల్లర్లతో ఒక ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు డీపీఆర్ తయారు చేసారు..
హిందూ కాలేజీ నుంచి లాడ్జి సెంటర్ వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రజలు కోరారు..
కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతు బంధనం పథకం కింద వందకోట్లు ఖర్చు తో బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు..
రెండు వైపులా 12 చొప్పున సర్వీస్ రోడ్డు వేయాలి..
విజన్ లేకుండా,అహంతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బ్రిడ్జి నిర్మాణం లో ఒంటెద్దుపోకడ పోయారు..
చట్టప్రకారం బాధితులకు నష్టపరిహారం అందించాలి..
నగరంలో ఎవరూ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా లేరు..
అమరావతి నిర్మాణంలో శంకర్ విలాస్ బ్రిడ్జి భాగం కాదా..
లక్ష కోట్లు అమరావతి నిర్మాణాని ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా శంకర్ విలాస్ బ్రిడ్జి కోసం 200 కోట్లు ఖర్చు చేయలేరా..
మోదుగుల వేణుగోపాల రెడ్డి, మాజీ ఎంపీ కామెంట్స్
శంకర్ విలాస్ బ్రిడ్జి అరవై సంవత్సరాలు దాటిందంటూ పడవేశారు..
నగర ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా బ్రిడ్జి కూలదోశారు.
2047 కైనా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందా..
గతంలో నేను నరసరావుపేట ఎంపీగా ఉన్న సమయంలో ఎనిమిది గంటల్లో RUB నిర్మించాం..
సేతు బంధన్ పథకం ద్వారా వంద కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతాం అనడం దుర్మార్గం..
జీజీహెచ్, మెడికల్ కాలేజీలకు, ఓల్డ్ క్లబ్ రోడ్డుకు వెళ్ళాలంటే గంట పైగా సమయం పడుతుంది..
ఈ బ్రిడ్జి వలన నగర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు..
షాపుల యజమానులు నష్టపరిహారం బాండ్లు కాకుండా నగదు ఇవ్వాలి..
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానం చేసే బ్రిడ్జి ఇది..
గతంలో 160 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్ వేయించాము..
#SivaNagendra #Guntur




