విజయవాడ నగరపాలక సంస్థ
భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచండి*
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*
భవాని దీక్ష విరమణలకు వచ్చే భక్తుల రద్దీ పెరుగుతున్నందున భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం శాఖాధిపతులు, భవానీ దీక్ష విరమణ విధుల్లో ఉన్న వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్లో భవానీ దీక్షల విరమణల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని మూడు షిఫ్ట్ లలో సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని షిఫ్ట్లు మారే సమయంలో రిలీవర్ వచ్చేంతవరకు షిఫ్ట్ లో కచ్చితంగా విధులు నిర్వహించాలని, విధుల్లో సమయపాలన కచ్చితంగా ఉండాలని, భవాని దీక్షల విరమణ సందర్భంగా భవాని భక్తులకు ఎటువంటి లోపం లేకుండా బోర్డర్ పాయింట్లలో ఎప్పటికప్పుడు స్టాక్ ని చూసుకుంటూ, త్రాగునీరు పంపిణి లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, భవానీ భక్తుల రద్దీ పెరగటం వల్ల త్రాగునీటి బాటిళ్లను మరింత పెంచాలని ఇప్పటికే 15 లక్షల వాటర్ బాటిళ్ళు తెప్పించినప్పటికీ ఆరు లక్షల వాటర్ బాటిల్ వరకు భవాని భక్తులకు పంపిణీ చేయగా, చివరి రెండు రోజుల్లో భవాని భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల స్టాక్ పాయింట్ లో మరిన్ని వాటర్ బాటిళ్ళు పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు భవాని భక్తులకు పాలు బిస్కెట్ల పంపిణీ లో ఎటువంటి లోపం ఉండరాదని, ఇప్పటికే 2 లక్షల బిస్కెట్లు, 80 వేల పాలు పంపిణీ చేయగా భవానీల రద్దీ అనుగుణంగా వారికి కల్పించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల పరిశుభ్రత విషయంలో అలసత్వం వహించరాదని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి గంటకు విజయవాడ నగరపాలక సంస్థ వారు భవాని దీక్షల విరమణ సమయంలో కల్పిస్తున్న సౌకర్యాల ప్రతి అంశంపై నివేదికను సమర్పించాలని, సౌకర్యాలలో ఎటువంటి లోపం గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని, డ్రోన్లతో నిరంతరం సర్వే చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, చెప్పుల స్టాండ్లు, పాలు, బిస్కెట్ల వంటి విషయాల్లో ఎటువంటి లోపం కనిపించిన వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద భవాని దుస్తుల తొలగింపు చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని, కన్వేయర్ బెల్ట్ ద్వారా నిరంతరం భవాని దుస్తులను తొలగిస్తుండాలని అధికారులను ఆదేశించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్లో శాఖాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ



