సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శంకరరావును అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్…*
*- శంకరరావుకు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి…*
*- రైతులకు అండగా నిలబడుతున్న తీరుపై మంత్రి ప్రశంసలు..*
*- మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శంకరరావు*
పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, కడకెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ వేర్ ఇంజినీర్ మరడాన శంకరరావును రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు.
శంకరరావుకు ఫోన్ చేసిన మంత్రి రైతులకు శంకరరావు ఉపయోగపడుతున్న తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. కష్టాల్లో ఉన్న రైతులకు శంకరరావు అందించే సేవలు కొనియాడదగినవి అని పేర్కొన్నారు. శంకరరావుకు మంత్రి స్వయంగా ఫోన్ చేయడానికి గల కారణాలను పరిశీలిస్తే…..
మరడాన శంకరరావు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 2019లో తమ స్వగ్రామం పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం,కడకెల్లలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిశీలించాడు. అప్పటి రైతు భరోసా కేంద్రాల్లో సంచులు దొరక్కపోవడం, సమయానికి వాహనాలు రాకపోవడం.
ధాన్యం కొనుగోలులో జాప్యం వల్ల దళారీలకు రైతులు ధాన్యం అమ్ముకోవడం వంటి సమస్యల్ని అధ్యయనం చేశాడు. ఆ సమయంలో రైతులు ప్రభుత్వానికే ధాన్యం అమ్ముకోవాలి, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది, పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని శంకరరావు భావించాడు. తన సొంత డబ్బులతో రైతులకు సంచులు ఇప్పించడం.
వాహనాలు పెట్టి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం వంటి పనులు చేస్తూ రైతులకు సహాయసహకారాలు అందించాడు. రైతులకు ధాన్యం డబ్బులు వచ్చిన తర్వాత శంకరరావుకు తిరిగి ఇచ్చేయడం వంటివి చేస్తున్నారు. రైతులకు అవసరమైన సమయంలో శంకరరావు సగటున రూ.1లక్ష వరకు వడ్డీలేని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెట్టుబడులు




