Sunday, December 14, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే |

అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే |

*తెలుగు రాష్ట్రాల
అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం…..2029 ఎలక్షన్ కి లేనట్టే*
అమరావతి
రాష్ట్ర విభజన చట్టం(2014)లోని సెక్షన్‌ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి.. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 225కి పెంచుకునే వెసులుబాటు
జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదిత
కేంద్రం ఈ ఏడాది జూన్‌ 4న 2027 జనగణనకు షెడ్యూల్‌ ప్రకటన

జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. కేంద్రం ఈ ఏడాది జూన్‌ 4న 2027 జనగణనకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియకు రూ.11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రారంభ మై తుది నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. దీంతో, 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది.

ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఇంకో ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్‌ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు సాధ్యం కావు.
ఆ తర్వాత పునర్విభజన చేపడితే.. 2034 ఎన్నికలకు కొత్త నియోజవకర్గాలు అందుబాటులోకి రానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments