*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు ఎం రవి*
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15 న*
*ఎర్రజెండాల ఆవిష్కరణ*
సిఐటియు 18వఅఖిలభారత* *మహాసభ లసందర్భంగా*
15న కార్మిక* *వాడల్లో సిఐటియు జెండాలు ఆవిష్కరించవలసిందిగా సిఐటియు రాజధాని కమిటీ పిలుపు*
డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు*
జనవరి 4న కార్మిక మహా ర్యాలీ, బహిరంగ సభ*
ఈ సందర్భంగా సిఐటియు నేత ఎం రవి మాట్లాడుతూ సిఐటియు 18 అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయని అన్నారు
ఈ సందర్భంగా జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో లక్షలాదిమంది కార్మికులతో మహా ర్యాలీ జరుగుతుందని, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని అన్నారు
ఈ మహాసభల నేపథ్యంలో రాజధాని లోని కార్మిక వాడల్లో డిసెంబర్ 15వ తేదీన సిఐటియు పతాకాల ఆవిష్కరణను చేపడుతున్నట్లుగా తెలిపారు
నాలుగో తేదీన విశాఖలో జరగనున్న కార్మిక ర్యాలీలో రాజధాని ప్రాంతంలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రవి కోరారు
కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం
లేబర్ కోడుల పేరుతో కాలరాచి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు
లేబర్ కోడ్ ల వలన కార్మికుల కుపని భద్రత ఉండదని అన్నారు
కార్మికులు కార్పొరేట్లకు ఎట్టి చాకిరీ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు
కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన లకు సిద్ధం కావాలని కోరారు
క్రిస్మస్ పండుగ నాటికైనా గత జులై నెల మున్సిపల్ కార్మికులసమ్మె కాలపు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు చెల్లించాలని కోరారు
ఎంటిఎంసీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనెలు, మాస్కులు, గ్లౌజులు, యూనిఫామ్, చెప్పులు, ఐడి కార్డ్ ,రక్షణ పరికరాలు అందజేయాలని రవి డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంత మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఏ శాంతకుమారి టి బాబు యూనియన్ నాయకులు ఆర్ వేణు ఆవుల నారాయణ స్వర్ణకుమారి మేరీ స్వరూప కుశాల రావు సుందర్ రావు సిఐటియు నాయకులు వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు




