కర్నూలు : కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో రాత్రి బస (పల్లె నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్న కర్నూలు పోలీసులు.జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ పోలీసు అధికారులు ఆయా సమస్యాత్మక గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 6 గ్రామాలలో రాత్రి బస ( పల్లె నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గ్రామస్తులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాల జోలికెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మకూడదని, మహిళలు, బాలబాలికల పై జరిగే నేరాలు, సైబర్ మోసాల బారిన పడకూడదని, అపరిచితుల కాల్స్ మరియు లింకులు క్లిక్ చేయరాదని, బ్యాంకు ఖాతాల ఓటిపిలు తెలియని ఎవరికి చెప్పకూడదని, రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన చేస్తున్నారు.
ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తమ వంతు భాద్యతగా గ్రామాలలోని యువత, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో పోలీసు అధికారులు, గ్రామాలలోని ప్రజలు యువత, తదితరులు పాల్గొన్నారు.




