కర్నూలు :
13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19,577 కేసులు పరిష్కరించారని జిల్లా న్యాయ సేవా సంస్థ వెల్లడించింది. కర్నూల్ లో శనివారం జరిగిన లోక్ అదాలత్ లో 197 మోటార్ యాక్సిడెంట్ కేసులలో ఇన్సూరెన్స్ కంపెనీ ల ద్వారా బాధితులకు 6.34 కోట్ల నష్టపరిహారం ఇప్పించినట్లు తెలియచేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన 28 బెంచిలా ద్వారా సివిల్ క్రిమినల్ మరియు మోటార్ ఆక్సిడెంట్ కేసులను విజయవంతం గా పరిష్కరించినట్లు కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి తెలియజేశారు




