విజయవాడ
15-12-2025
ప్రచురణార్ధం
అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
స్థానిక 43వ డివిజన్ ఊర్మిళా నగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వైసిపి పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మద్దు బాలు ఆధ్వర్యంలో సోమవారం నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించా. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములని అన్నారు. 51 రోజుల నిరాహారదీక్ష చేసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి మన రాష్ట్రాన్ని సాధించారన్నారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మాగాంధి చూపిన బాటలో పొట్టిశ్రీరాములు నడిచారన్నారు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అగౌరవపరిచింది చంద్రబాబు అయితే.. మాజీ సీఎం జగన్ ఆ దినోత్సవాన్ని గౌరవించారన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎండి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు




