బడే నాగజ్యోతి బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్
కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): కొత్తగూడ మండలంలోని తాటివారి వేంపల్లి,మాసంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ బడే నాగజ్యోతి పాల్గొని మాట్లాడుతూ…
గుడాలను గ్రామపంచాయతీలుగా తీర్చిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని గ్రామాల అభివృద్ధి కోసమే తండాలను, గుడాలను గ్రామపంచాయతీలుగా చేయడం జరిగిందని మా గూడెంలో మా రాజ్యం కోసం కెసిఆర్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి చేయడం జరిగిందని తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ బుజ్జి-సురేష్ నాయకులను భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది.




