*ప్రచురణార్థం* 14-12-2025*
*జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ ప్రెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యం :
కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య*
ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి 45 మంది మహిళలతో బయలుదేరిన బస్సు
జెండా ఊపి బస్సు ప్రారంభించిన చెన్నబోయిన , జంపాల
ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజుల శిక్షణ
నేచురల్ ఫార్మింగ్, వర్మీ కంపోస్ట్, తేనే తయారీ పై శిక్షణ
ఇబ్రహీంపట్నం : ఎన్టీఆర్ జిల్లా లో అర్బన్ ప్రాంత, రూరల్ నియోజకవర్గాల మండలాలకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలతో పాటు ప్రతి మహిళ ఎంటర్ ప్రెన్యూర్ తయారై రాణించాలనే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజలు పాట నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందే 45 మంది మహిళలతో బయలుదేరిన బస్ ను ఆదివారం ఇబ్రహీం పట్నం రింగ్ సెంటర్ నందు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య స్థానిక నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఎన్.ఐ.ఆర్.డి లో ఐదు రోజుల శిక్షణ తీసుకునేందుకు 3వ కింద వెళ్లిన ఈ 45 మంది ఎస్.హెచ్.జి మహిళలకు నేచురల్ ఫార్మింగ్, వర్మీ కంపోస్ట్, తేనే తయారీ పై శిక్షణ ఇస్తారు. తిరువూరు నియోజకవర్గం నుంచి ఎ.కొండూరు మండలం, గంపలగూడెం మండలం , మైలవరం నియోజకవర్గం నుంచి జి.కొండూరు మండలం, నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం, వీరులపాడు మండలం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పెనుగ్రంచిప్రోలు మండలం, వత్సవాయి మండలం, జగ్గయ్యపేట రూరల్ ప్రాంతాలకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలు నైపుణ్యాభివృద్ది శిక్షణకు వెళ్లటం జరిగింది.
ఈ సందర్భంగా కొండపల్లి చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ కృషి వల్ల ఎస్.హెచ్.జి మహిళలజీవితాల్లో వారి జీవనోపాధి మెరుగుపర్చుకునేందుకు చక్కని అవకావం లభించిందన్నారు. ఇప్పటి వరకు ఎన్.ఐ.ఆర్.డి కి ఐదు రోజుల నైపుణ్యాభివృద్ది శిక్షణ కోసం ఎంపీ కేశినేని శివనాథ్ రెండు బ్యాచ్ లను పంపించటం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ది కోసం ఎన్.ఐ.ఆర్.డి తో కేశినేని ఫౌండేషన్ చేసుకున్న ఎమ్.వో.యూ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి మార్గం వైపు నడిపించేందుకు శిక్షణ ఇప్పిస్తున్నారని తెలిపారు.
టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మాట్లాడుతూ మహిళలు సాధికారత, స్వయం సమృద్ధి సాధించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో కేశినేని ఫౌండేషన్ ఎస్.హెచ్.జి మహిళలకు చేయూతగా నిలుస్తుందన్నారు. గచ్చిబౌలిలోని ఎఫ్.డి.డి.ఐ లో 20 మంది మహిళలకు లెదర్, నాన్ లెదర్ ప్రొడక్ట్స్ తయారీ పై, గార్మెంట్స్ పై శిక్షణ పొందుతున్నారని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్ ల్లో దాదాపు 150కి పైగా మహిళలు శిక్షణ తీసుకున్నారని వెల్లడించారు. వీరంతా మిల్లెట్స్ ప్రొడక్ట్స్ తయారీ, హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీ, హోమ్ బెస్ట్ ప్రొడక్ట్స్ తయారీపై శిక్షణ పొందారని తెలిపారు. వీరు తయారు చేసే వస్తువుల మార్కెటింగ్ విషయంలో కూడా కేశినేని ఫౌండేషన్ అండగా నిలబడుతుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా రూరల్ సమాఖ్య అధ్యక్షురాలు కందుల కల్పన మాట్లాడుతూ తమ జీవనోపాధి మెరుగుదల కోసం ఇలాంటి శిక్షణ గత పదేళ్లలో ఏ నాయకుడు ఇప్పించలేదన్నారు. ఎస్.హెచ్.జి మహిళలకు ఎంపీ కేశినేని శివనాథ్ చేస్తున్న సాయం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు తరిమికొండ బాలాజీ రావు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో-ఆర్డినేటర్స్ సొంగా సంజయ్ వర్మ, జివి నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి, మైలవరం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్, స్టేట్ తెలుగు రైతు సంఘం కార్యదర్శి రాయల్ లీలా ప్రసాద్, డి.ఆర్.డి.ఎ కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ ఎమ్.రామారావులతో పాటు స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




