Tuesday, December 16, 2025
spot_img
HomeSouth ZoneTelanganaజీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు |

జీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు |

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్):మూడవ విడత ఎన్నికల్లో భాగంగా కొత్తగూడ మండలంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అననతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….. సీతక్క చాలా కాలం నుండి రాజకీయాల్లో ఉండి కింది స్థాయి వారిపై మంత్రి అన్న ఆలోచన లేకుండా వ్యక్తిగతదూషణ చేస్తున్నారని… సీతక్క స్థితి బాగలేనందున ఇలా జరిగిఉండవచ్చునని అన్నారు.

కళ్యాణ్ లక్ష్మి తీసుకోవడానికి ప్రేరణ ములుగుజిల్లా భాగ్య తండా కారణమని, ఇది దేశానికే ఆదర్శనమని అన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఆడబిడ్డలకు తండ్రిగా మేనమామగా కేసీఆర్ నిలిచారని గుర్తుకు చేశారు. స్వర్గీయ చందులాల్, నేను (సత్యవతి రాథోడ్) గాని చేసిన అభివృద్ధి ఈనాడు సీతక్క జీవితాంతం మంత్రి గా ఉండి చేసిన అలాంటి అభివృద్ధి చేయలేదని తెలియజేశారు. మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గనికి చేసింది ఏంటో చెప్పాలని అన్నారు.

ములుగు నియోజకవర్గంను జిల్లా, మెడికల్ కాలేజ్, జిల్లా ఆస్పత్రి, మేడారం,ములుగు అభివృద్ధి చేసింది కేసీఆర్ గుర్తుకు లేడా… అంటూ ఘాటైన వాక్యం చేశారు.బిఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించే రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పర్సంటేజ్ ల కోసం పాకులాడుతూ పరిపాలనను పక్కకు పెట్టారని, మార్పు అంటే విగ్రహాలు మార్చడం, ఇందిరమ్మ పేరు పెట్టడం కాదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికి ఈ ప్రాంతానికి పాకాల నుండి నీళ్లు ఇచ్చి రైతులకు రెండు పంటలతో ఈ ప్రాంత అభివృద్ధి చెందేదని గుర్తు చేశారు.

ఈ రాజకీయ బెదిరింపులు పోవాలంటే మండలకేంద్రంలో బిఆర్ఎస్ బలపరచిన భూపతి శ్యామల-తిరుపతిని, అలాగే మండలంలో ఉన్న అన్నీ బిఆర్ఎస్ సర్పంచ్ లను భారీ మెజార్టీతో గెలిపించి విజయఢంకా ను మ్రోగించాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలియజేశారు. అనంతరం ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి,మండల అధ్యక్షులు వేణు, అధికార ప్రతినిధి నెహ్రూ, వీరన్న,సాంబయ్య టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments