Home South Zone Andhra Pradesh విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు

0

*విజయవాడ నగరపాలక సంస్థ*
*అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు*

అనుమతి లేని భవన నిర్మాణాలు తొలగిస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం ఉదయం చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్ సూచనల మేరకు, కార్పొరేషన్ పరిధిలోని ఉన్న అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో న్యూ ఆర్ టీ సి కాలనీ లో ఉన్న అనధికార నిర్మాణాలను గుర్తించి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రాజ్ కమల్ తొలగింపు చర్యలు తీసుకున్నారని అన్నారు.

ఈ సందర్భంలో కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏవైనా అనధికార నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే, వాటిపై తక్షణ చర్యలు తీసుకోబడతాయని, VMC టౌన్ ప్లానింగ్ బృందం నిరంతర పరిశీలన చేపట్టి, అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగించే కార్యక్రమం కొనసాగిస్తోందిని, కావున నగర ప్రజలు తమ నిర్మాణాలు అనుమతులతోనే చేపట్టవలెనని, లేనిపక్షంలో విధినిర్వహణ చర్యలు తప్పవని తెలిపారు.

*పౌర సంబంధాల అధికారి*
*విజయవాడ నగరపాలక సంస్థ*

NO COMMENTS

Exit mobile version