ఏపీలో ఉద్యోగాల పండుగ..6వేల మందికి నియామక పత్రాలు!
ఏపీలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటోంది. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ పేరుతో 5 సంవత్సరాలు నిరుద్యోగులను జగన్ రెడ్డి మోసం చేశారు. ఐతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే లోకేష్ కృషితో 13 వేలకుపైగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరో 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 6 వేల మందికి సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం కోసం మంగళగిరి పోలీస్ బెటాలియన్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఉద్యోగాల భర్తీని ఏపీ ప్రభుత్వం పండగలా నిర్వహిస్తోంది. ఉద్యోగం సాధించిన అభ్యర్థుల కుటుంబాలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మొత్తం 17 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం.. అభ్యర్థులందరినీ తిరిగి ప్రభుత్వమే ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు తీసుకెళ్లనుంది. అభ్యర్థులను నియామక పత్రాలు అందించిన అనంతరం పోలీస్ ట్రైనింగ్ గురించి వివరిస్తారు. ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ప్రొగ్రామ్ ప్రారంభం కానుంది.
9 నెలల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, 6,014 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారిలో 5,757 మంది ‘ఫిట్ ఫర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందారు. వీరందరికీ ఇప్పుడు ట్రైనీ కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. నియామక పత్రాలు అందుకోనున్న అభ్యర్థుల్లో 3,343 మంది సివిల్ కానిస్టేబుళ్లుగా, 2,414 మంది APSP కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారిలో 993 మంది మహిళలు ఉన్నారు.
వైసీపీ సర్కార్ 2022 నవంబర్‌లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినీ ఎగ్జామ్ నిర్వహించి తర్వాత ఎంపిక ప్రక్రియను మధ్యలోనే ఆేసింది. అభ్యర్థుల గోడును పట్టించుకోలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో నిరుద్యోగులు నరకయాతన అనుభవించారు. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది.ఏడాదిలోనే ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టులో రిజల్ట్ ఇచ్చింది.ఇక, త్వరలో మరో 5 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం.
……..




