Tuesday, December 16, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ...

ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా

ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు
వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే —
ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా స్ట్రగుల్ కమిటీ
*******************
కృష్ణాజిల్లాలో ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా స్ట్రగుల్ కమిటీ జిల్లా కార్యదర్శి సౌమ్య రేఖ ఆద్వర్యంలో పలువురు స్టాఫ్ నర్సులు కలిసి జిల్లా కలెక్టర్ డికె బాలాజీ కి ఫిర్యాదు అర్జీ అందజేశారు.
తొలుత ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి సౌమ్య రేఖ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులు మాత్రమే మూడు షిఫ్టులలో పని చేస్తున్నారని, ఒకరోజు తీసుకునే డే ఆఫ్ (వీక్లీ ఆఫ్) ఇవ్వడానికి జిల్లా వైద్యాధికారి నిరాకరిస్తున్నారని, అత్యవసర సమయంలో కూడా సాధారణ సెలవు ఇవ్వడానికి వైద్యాధికారి నిరాకరిస్తున్నట్లు ఆమే పేర్కొన్నారు.
రాత్రి షిఫ్ట్ లో భద్రతా సిబ్బంది లేదా సపోర్టింగ్స్టాఫ్ లేకుండా మహిళా స్టాఫ్ నర్స్ ఒకరు మాత్రమే అభద్రత భావంతో విధులు నిర్వహించాల్సి వస్తుందని ఆరోపించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాలుగవ స్టాఫ్ నర్స్ సపోర్టింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.నిరసనకుకార్యక్రమం సంఘీభావం తెలిపిన సి ఐ టి యు జిల్లా కార్యదర్శి బూర.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఉద్యోగులకు వారంతపు సెలవులు అనేవి వారి హక్కు అని అలాంటిది జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి హక్కులను కాలరాసేలా, మీకు సెలవులు లేవు అని ప్రతి రోజు విధులకు హాజరు అవ్వాల్సిందేనని చెప్పడం నిబంధనలకు విరుద్ధం అన్నారు.కాబట్టి స్టాఫ్ నర్సులకు వారంతపు సెలవులు ఇవ్వాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో స్టాఫ్ నర్సులు
సి హెచ్ రాణి, ఎం.ప్రవీణా,ఎన్.సునీత,
పి.ఆదిలక్ష్మి,పి.వాసంతి,
కె.ఆశాజ్యోతి, కె.నాగలక్ష్మి,డి.విజయ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments