Tuesday, December 16, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!

ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!

కర్నూలు :  కర్నూలు జిల్లా…విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.•  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 108 ఫిర్యాదులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 108 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …1)   గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి   కాంట్రాక్టు బేసిస్ కింద మున్సిపాలిటీలో గానీ , కోర్టులో గానీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర రూ. 50 వేలు తీసుకొని మోసం చేశాడని న్యాయం చేయాలని కర్నూల్ , ఒన్ టౌన్ కు చెందిన యుగంధర్ ఫిర్యాదు చేశారు. 2) నా చిన్న కుమారుడు ఇర్ఫాన్ భాష గత కొద్దిరోజులుగా కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని  అతని ఆచూకీ తెలిపి నాకు న్యాయం చేయాలని కర్నూలు, గడ్డ స్ట్రీట్ కి చెందిన ఖమ్ రున్నీసా  ఫిర్యాదు చేశారు.3) నా మొబైల్ కి  పీఎం కిసాన్ పేరుతో ఒక నకిలీ లింకు వచ్చింది,  నేను తెలియకుండానే దానిని ఓపెన్ చేశాను. నా  బజాజ్ కార్డు నుండి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కొక్కటీ రూ.35 వేల విలువ గల 3 సెల్ ఫోన్లు కొనుగోలు చేసి నా బజాజ్ కార్డు నుండి డబ్బులు కట్ అయ్యేవిధంగా చేశారని న్యాయం చేయాలని కర్నూలు , నిడ్జూర్ గ్రామానికి కు చెందిన శివశంకర్ ఫిర్యాదు చేశారు.4) కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి భాస్కర్ అనే వ్యక్తి రూ. 1 లక్ష 50 వేలు తీసుకొని మోసం చేశాడని కర్నూల్  బుధవార పేటకు చెందిన రోజా రాణి ఫిర్యాదు చేశారు.5) పెళ్లయి పదేళ్ల అయింది, నేను ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను.  ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త శాంతిరాజు రూ. 20 లక్షల వరకు ప్రైవేట్ సంస్థలలో నా పేరు మీద రుణాలు తీసుకొని చెల్లించడం లేదని,  ఒక సంవత్సరం నుండి నన్ను, నా పిల్లల్ని చూసు కోవడం లేదని, నన్ను అనుమానిస్తూ వేధిస్తున్నాడని న్యాయం చేయాలని కర్నూల్ అశోక్ నగర్ కు చెందిన మనోరంజని ఫిర్యాదు చేశారు. 6) ఆస్తులు పంచుకుని, నడవలేని స్థితిలో ఉన్న నన్ను నా కుమారులు , కోడళ్ళు  చూసుకోవడంలేదని,  బయటకు గెంటేశారని క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో  సిఐలు శివశంకర్, రామకృష్ణ, విజయలక్ష్మి లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments