మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్ నిలయం ప్రాంతాలలో ఎన్నో ఏళ్లుగా మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థలను గుర్తించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి,అధికారులతో నిరంతరం మాట్లాడి 70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయింపజేశారు.
సోమవారం HMWS & SB ద్వారా పనులను, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మురుగునీటి సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉందని అప్పటి పాలకులు ఈ సమస్యను గాలికి వదిలేయడంతోనే అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్ నిలయం ప్రాంతవాసులు ఇబ్బందులకు గురయ్యారని, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడి సమస్యను స్థానికుల ద్వారా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయింప చేశానని, అందులో భాగంగానే ఈరోజు 70 లక్షల రూపాయలతో ఈ సమస్య పరిష్కారానికి పనులను ప్రారంభిస్తున్నామని అన్నారు.
అదేవిధంగా కంటోన్మెంట్ ను కూడా GHMC లో విలీనం చేస్తే ఇదే విధంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులను తీసుకుని వచ్చి అభివృద్ధి చేయొచ్చని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను GHMC లో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్,వెంకట్రాజు,
నందికంటి రవి, బాబూరావు, నర్సింగ్,శివ,మాలతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju




