*స్పా సెంటర్లు బ్యూటీ పార్లర్ లు పేర్లతో మా వృత్తికి ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది – అధ్యక్షులు మూషిడిపల్లి రమణ*
విజయవాడ: బ్యూటీ పార్లర్ స్పాల పేరుతో మా వృత్తికి ఆర్థికంగా నష్టం జరుగుతుందనీ మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రమణ అన్నారు. ఆయన మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ అచారాలలో భాగమైనటువంటి క్షవరవృత్తిని నాయి బ్రాహ్మణులు తరతరాలుగా ఇల్లు ఇల్లు తిరిగి జీవనం గడుపుతూ ఉండేవారిమని నేడు ఆత్మ అభిమానం పేరుతో బంకులను ఏర్పాటు చేసుకొని క్షవరవృత్తి చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్న తరుణంలో కొంతమంది స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దీనివల్ల మా నాయి బ్రాహ్మణుల ప్రతిష్టకు భంగం కలుగుతుందని ప్రభుత్వం స్పందించి మెడికల్ షాపులకు బీఫార్మసీ సర్టిఫికెట్ మాదిరి సెలూన్ షాపులకు కూడా నాయి బ్రాహ్మణ కులం సర్టిఫికెట్ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేయాలని దీని వలన మా సంఘమునకు గౌరవం ప్రతిష్ట దెబ్బతినకుండా ఉంటుందని అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిని నిర్మూలించవచ్చని తెలిపారు. ప్రస్తుతం 150 యూనిట్ల ఉచిత కరెంటు అమలవుతున్న కూటమి ప్రభుత్వ మరొక 50 యూనిట్లు పెంచుతూ ఇటీవల జీవో విడుదల చేశారని పూర్తిస్థాయిలో 200 యూనిట్లు అమలయ్యేలా చూడాలని కోరారు.కార్పొరేట్ సెలూన్ల వలన మా వృత్తికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. దేవాలయాలలో క్షౌర వృత్తి, నాదస్వరం చేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత మరియు నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా పరిగణించాలని. ప్రతి జిల్లాలోనూ మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు.నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో నాలుగు లక్షల 96,000 మంది పైగా నాయి బ్రాహ్మణులు ఉన్నారని మా కష్టాలు చెప్పుకోవడానికి రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే గాని లేరని జనాభా తమాషా ప్రకారం నాయి బ్రాహ్మణులకు రాజకీయ ప్రాముఖ్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరేటి నరసింహారావు, రాష్ట్ర నాయకులు జగన్నాథం , శివ, ముత్యాలు ,అప్పారావు, వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ రాయవరపు నానాజీ, నరసింహారావు, మల్లవరపు నరసింహారావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు




