ది.15-12-2025 న అమరి జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ది బెజవాడ బార్ అసోసియేషన్ లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎ కె బాష గారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి 58 రోజులపటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని మద్రాసులో మన తెలుగు వారు పడుతున్న కష్టాలను చూసి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడదీయాలని ఉద్యమాన్ని చేపట్టి మన తెలుగువారి కోసం ఆయన సుఖ సంతోషాలను వ్యక్తిగత ఆశలను పక్కన పెట్టి తెలుగుజాతి గౌరవం కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారు అని, 1952 లో ఆయన చేసిన దీక్ష భారత దేశ చరిత్రను మార్చిందని ఆయన త్యాగ ఫలితంగానే 19503 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని ఉపన్యసించారు. ఈ కార్యక్రమానికి గవర్నింగ్ బాడీ సీనియర్ జూనియర్ న్యాయవాదుల హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.




