మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి గెలిపించండి
గ్రామం కోసం మీ సేవకుడిగా పని చేస్తా
కొత్తగూడ డిసెంబర్, (భారత్ అవాజ్): మహబూబాబాద్: కొత్తగూడ మండలంలోని రామన్నగూడెం తండా గ్రామ అభివృద్ధి కోసం తన సాయి శక్తుల కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి బానోత్ సుగుణ-కిషన్ నాయక్ హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు, వారి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన పనుల కోసం నిధులు తెచ్చి పనిచేస్తానని అభివృద్ధి పనులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చానని, రాజకీయలకు కుల,మతలకు అతీతంగా ప్రజా సేవ చేస్తానని, ఒక్కసారి సర్పంచిగా అధికారం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికలలో తనను బలపరిచి తమకు ఓటు వేయాలని
అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తన గెలుపు కోసం కృషి చేయాలని సుగుణ-కిషన్ కోరారు.




