*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త – పొడి చెత్త వేరుగా సేకరించేందుకు ఏడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి మన జిల్లాకు అందాయి. వీటివల్ల గ్రామాల్లో చెత్త సేకరణ సులభతరమవుతుంది. ఈ ఆటోలను గౌరవ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, డీపీవో పి.లావణ్య కుమారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు*




