Home South Zone Telangana వైదిక బ్రాహ్మణ సంఘం భవనానికి స్థలం కోరిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి |

వైదిక బ్రాహ్మణ సంఘం భవనానికి స్థలం కోరిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి |

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖల మంత్రి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు ని మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే  మంత్రిని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు  సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యల కోసం సీసీఎల్ఏ (CCLA) కు సిఫారసు చేశారు.

మంత్రి సానుకూల స్పందనకు ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి సబిత అనిల్ కిషోర్ గౌడ్,  మేకల సునీత రాము యాదవ్, తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు ప్రభాకర్ రావు,  చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju

NO COMMENTS

Exit mobile version