పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త..
క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు హెచ్చరించారు. ఆన్లైన్ షాపింగ్, గిఫ్ట్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ పేరుతో వచ్చే లింకులు, మెసేజీలు మోసపూరితమైనవి కావచ్చని తెలిపారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని, వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మవొద్దని సూచించారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు




