మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా (IFS) గారిని మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లిం, క్రైస్తవ సముదాయాల ప్రజలకు స్మశాన వాటిక కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే వినతి పత్రాన్ని సమర్పించారు.
నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, స్మశాన వాటిక కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడం అత్యవసరమని ఆయన వివరించారు.
దీనిపై కార్యదర్శి శ్రీ షఫీఉల్లా సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం ద్వారా మైనార్టీ వర్గాల మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి ముందడుగు పడిందని ఎమ్మెల్యే తెలిపారు.
Sidhumaroju





