*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*
*ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో*
ఐటీ, విద్యాశాఖల మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలోని లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్ ఖర్చుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల హరిదాసు రూ.25,000 విరాళంగా అందజేశారు.
ఈ మొత్తాన్ని ప్రార్థన మందిరం పెద్దలకు ఆయన చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా బత్తుల హరిదాసు మాట్లాడుతూ, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో అన్ని మతాల ప్రార్థనా మందిరాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. సామాజిక ఐక్యత, సర్వమత సమభావమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు ఎమ్మెల శ్రీనివాస్ రావు, కర్రి భాస్కర్ రావు, కర్రి అబ్రహం, కర్రి పరిశుధ రావు, అడగొప్పుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.




