*మంత్రి నారా లోకేష్ చొరవతో బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారం తో ప్రభుత్వ పాఠశాలలలో కూచిపూడి నృత్యం నేర్చుకునుటకు ఏర్పాట్లు*
రాష్ట్ర ఐటీ,విద్యా శాఖల మంత్రి వర్యులు, మంగళగిరి శాసన సభ్యులు నారా లోకేష్ గారి ఆదేశాలమేరకు బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారం తో ఇకపై మంగళగిరి ప్రభుత్వ పాఠశాలలో కూచిపూడి నృత్యం నేర్పుంచనున్నారు,నియోజకవర్గంలో ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి వారంలో ఒకరోజు కూచిపూడి నృత్యం నేర్పనున్నారు .
విద్యార్థులు చదువుతో పాటు కళలలో కూడా రాణించడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని, ఆ లక్ష్యానికి అనుగుణంగా బాల్ కార్పొరేషన్, అనంత ఆనంద ట్రస్ట్ లు పనిచేస్తాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు,ఈ సందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి లోకేష్ కు ధన్యవాదములు తెలిపారు




