Thursday, December 18, 2025
spot_img
HomeSouth ZoneTelanganaశ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|

శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్  శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక మంగళవారం సూరారం కాలనీ లోని శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం భవనంలో జరిగింది. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గోగులపాటి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాత కార్యవర్గాన్నే కొనసాగిస్తూ అనారోగ్యంతో సంఘ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొనలేక పోతున్న సభ్యుల స్థానంలో సంఘకార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న సభ్యులకు కార్యవర్గంలో స్థానం కల్పించినట్టు గోగులపాటి కృష్ణమోహన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘ పఠిష్ఠత, విస్తరణ కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గంలో అధ్యక్షునిగా గోగులపాటి కృష్ణమోహన్, ప్రధాన సలహా దారునిగా సర్వేపల్లి రమేష్ కుమార్, గౌరవ సలహా దారులుగా రామదాసు పరశురామ శర్మ, హనుమంతరాయ శర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీరామశర్మ చక్రధారి, గడ్డం రాంబాబు, ప్రధానకార్యదర్శిగా నిట్టల వెంకట వీరభద్ర సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులుగా పురోహితుల హరిరాఘవేంద్ర శర్మ, సింహాచలం శ్రీధరాచార్యులు, ప్రచార కార్యదర్శులుగా రాచపూడి ప్రభాకర్ శర్మ.

కోడూరి జగదీష్ శర్మ, కోశాధికారిగా రుద్రావర్జుల సంజీవరావు, ప్రాంతీయ కార్యదర్శులుగా వెంకటేశం గారి రాధాకృష్ణ, రామడుగు రామకృష్ణ శాస్త్రి, అచ్యుతుని ఫణీంద్ర, కనుపర్తి సాయిరాం, కార్యవర్గ సభ్యులుగా దుర్గా నాగమోహన్ ఆదూరి, శివభాస్కర్, గీర్లపల్లి సాయి భరత్ రామ్, చింతపట్ల వెంకటరమణాచార్యులు, మహిళా కార్యవర్గ సభ్యురాళ్ళుగా నండూరి మాలతి, రుద్రావజ్ఞుల సుబ్బలక్ష్మి, సింహాచలం గీత, గడ్డం రుచిత, పుట్రేవు హైమ, రాచపూడి శ్రావణి, బండి సూర్య సుందరి, గంటి సునీతలను ఏకగ్రీవంగా ఎన్నికచేసినట్లు తెలిపారు.

Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments