Thursday, December 18, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్) పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
బుధవారం సూరారం కాలనీ బస్‌స్టాప్ పరిధిలోని మహాత్మా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

“గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ పేరు మీద ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని పేరుమార్చడం బీజేపీ ప్రభుత్వ రాజకీయ సంకుచితత్వానికి నిదర్శనమని. పేరు మార్చడమే కాకుండా కూలీలకు కనీస వేతనాలు పెంచడం, పని దినాలు100 నుంచి 200కి పెంచడం, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి” అని డిమాండ్ చేశారు.

మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం దేశ చరిత్రను మార్చే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని, ఇటువంటి నిర్ణయాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు సోమ్మన్నగారి శ్రీధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, నాగి రెడ్డి, సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, హరి కిరణ్, ,కరణ్, గఫ్ఫార్ , రాంచందర్, రాజు హరి,నరేందర్, యూసఫ్, హేమ తులసి, శైలజ, రేఖ , ప్రసన్న, అర్చన, రమ్య, సంతోషి, డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్, గణేష్, బుయ్యని శివ, ఎండి లాయక్, సంతోష్ ముదిరాజ్, ఎండి జాకీర్, నరేందర్ రెడ్డి, నర్సింహా , చందు, బుచ్చి రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments