*గుంటూరు జిల్లా*
*తాడేపల్లి*
*కార్యకర్తలను అదుపులో పెట్టుకో*
*జనసేన కానీ కూటమి నేతల జోలికి వస్తే ఖబడ్దార్*
*అరాచకాలు ఆకృత్యాలకు దాడులకు స్వస్తి చెప్పే వైసీపీ నీ సాగనంపారు*
*జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం గుర్తుంచుకో*
*కూటమి ప్రభుత్వం లో మీ ఆటలు చెల్లవు అని తప్పులు చేసిన వారికి వారి వెనుక ఎంత పెద్ద మనిషి ఉన్న చట్టపరమైన చర్యలు తప్పవు అనటానికి నిన్న రాత్రి తాడేపల్లి లోని మాజీ సీఎం ఇంటి దగ్గర ఘటనే ఉదాహరణ అని అన్నారు*
*గత రాత్రి తాడేపల్లి లోని జగన్ నివాసం వద్ద ప్రజా అవసరాలకు సైతం వినియోగించే రహదారిలో ఇష్టానుసారంగా వాహనం నడుపుతూ వెనుక వచ్చిన వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన సీతారాం*
*తప్పుకోమని దారి ఇవ్వమని వెనుక కారులో హరాన్ కొట్టిన వారి పై దాడికి దిగిన వ్యక్తి కారులో ఉన్న తాడేపల్లి పట్టణ జనసేన అధ్యక్షులు సోదరుడు మరియు అల్లుడు పై మద్యం మత్తులో అధినేత నివాసం వద్ద వీరంగం వేసిన సీతారాం దాడికి దిగాడు*
*మద్యం మత్తులో పరుష పదజాలం వాడుతూ తప్పు అని వారించిన వారి పై కూడా భౌతిక దాడికి దిగారని ప్రత్యక్ష సాక్షి తాడేపల్లి జనసేన పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు ఆరోపించారు*
*తాను విజయవాడ కు చెందిన మాజీ ఎమ్మెల్యే బంధువునని ఇది తమ అదినేత నివాసమని ఏమి చేసుకుంటావో చేసుకో వైసీపీ అంటే ఏంటో చూపిస్తా అంటూ చిందులు తొక్కారని ఆరోపించారు*
*ఘటన విషయాని తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా స్పందించిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు*
*విషయం తెలుసుకున్న జనసేన నేతలు జనసైనికులు పోలీస్ స్టేషన్ కు రాగా పోలీసుల వద్ద మద్యం మత్తులో ఉన్న యువకుడి హవాభావాలు చూసి ఆశ్చర్యపోయామని జనసేన నేత జొన్న రాజేష్ విలేకరుల సమావేశం లో తెలియచేశారు*
*తక్షణమే స్పందించిన పోలీసులకు జనసేన నేతలకు కూటమి నేతలకు జనసేన నేతలు కృతజ్ఞతలు తెలిపారు*
*జగన్ మోహన్ రెడ్డి మీ కార్యకర్తలను ఇలానే ప్రోత్సహించేది అంటూ ప్రశ్నించారు*
*ఈ కార్యక్రమం లో జనసేన నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, తాడేపల్లి పట్టణ జనసేన ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి శ్రీనివాసరావు,మండల జనసేన ప్రధాన్ కార్యదర్శి లాల్ చందు,19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు అంబటి వెంకటేశ్వరరావు, అంబటి రఘు , కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ శ్రీనివాసరావు
టీడీపీ నాయకులు తోట సాంబశివరావు , బిజెపి గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ నాయుడు, కాపునాడు అధ్యక్షులు తాడేపల్లి పుల్లపు భాస్కరరావు,టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ కేలి వెంకటేశ్వరరావు, శేషగిరి, కాపు రక్షణ వేదిక కౌన్సిలర్ చందు భవనారాయణ, మహానాడు నాగు, అల్లం మల్లి, ప్రకాష్ నగర్ వార్డ్ అధ్యక్షులు జిలాగా కల్యాణ, బ్రహ్మానందపురం వార్డు అధ్యక్షులు శంకరు, సలాం హోటల్ సెంటర్ చల్లా వెంకటేశ్వరరావు, శివప్రసాద్, మహానాడు 21వ వార్డు అధ్యక్షులు చక్రి , పవన్, MTMC కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు*




