Home South Zone Andhra Pradesh డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం |

డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం |

0

తాడేపల్లి
ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో లీగల్ మెట్రోలజీ అధికారులు వినియోగదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు తోపాటు పలు సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించారు.

అందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పట్నంలో గురువారం రత్నదీప్ సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు పలు సూచనలు చేసారు.తెనాలి డివిజన్ లీగల్ మెట్రోలజీ సి ఐ శేషసాయి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేస్తే వస్తువుల అంశంలో తూకం , మరియు పాక్యేజిపుడ్ విషయం లో లేబుల్ లు పైన పేర్కొన్న అంశాలు మాన్యుఫాక్చరింగ్ తేదిలు సరిగా ఉన్నాయా లేవా వంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వినియోగదారులను ఎవరైనా షాపు యాజమాన్యం వారు తూకం క్వాలిటీ విషయంలో మోసం చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెనాలి ఇన్ స్పెక్టర్ శేష సాయి తో పాటు వారి సిబ్బంది రవి కిషోర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version