Home South Zone Andhra Pradesh ప్రతిరోజు నీటి పరీక్షలను కచ్చితంగా నిర్వహించాలి |

ప్రతిరోజు నీటి పరీక్షలను కచ్చితంగా నిర్వహించాలి |

0
0

విజయవాడ నగరపాలక సంస్థ

*ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలి*

*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*

ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్డు, ఏఎస్ రామారావు రోడ్డు, క్రీస్తు రాజపురం, గంగిరెద్దుల దిబ్బ, మహానాడు రోడ్డు ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముందుగా గంగిరెద్దుల దిబ్బ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని, పాత పైప్ లైన్లతో లీకేజీ సమస్యలు వచ్చే ప్రతి పైప్లైన్ లు మార్చి కొత్త పైప్ లైన్లు వేసి ఎక్కడ లీకేజీ లేకుండా నీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఒక్కరికి శుద్ధమైన త్రాగునీరు సరఫరా అవుతుందా లేదా అని ప్రతి రోజు నిర్ధారించుకోవాలని, ప్రత్యేకంగా కొండప్రాంతాలలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రతిరోజు అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎమినిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలతో మాట్లాడి వారికున్న సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించుకుంటూ ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నగర పరిధిలో గల అన్ని ప్రాంతాలలో ఎమినిటీ సెక్రటరీలు ప్రతిరోజు త్రాగునీరు పై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని ఎక్కడైనా దుర్వాసన వస్తున్నది అని తెలిసినచో వెంటనే అది కలుషితముగా లేదా క్లోరిన్ కలిపిన నీరా అనేది తెలుసుకొని ఒకవేళ కలుషితం కానీ పక్షంలో అది క్లోరిన్ ద్వారా కూడా వాసన వస్తుందని ప్రజలను అవగాహన కల్పించాలని ఒకవేళ కలుషితమైన పక్షంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియ ప్రతిరోజు జరిగేలా అధికారులు పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు. హెడ్ వాటర్ వర్క్స్ లో శుద్ధమైన త్రాగునీరు మనం పంపిణీ ఎలా చేస్తున్నామో ప్రజల వద్దకు కూడా శుద్ధమైన తాగునీరు అంతే శుద్ధత తో వెళ్లేటట్టు నిర్ధారించుకోవాలని దానికి ఈ ప్రక్రియ ఎంతో అవసరం అని, దీనికి ఖచ్చితంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. షమ్మీ, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ

NO COMMENTS