Friday, December 19, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు |

రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు |

*తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….*

*“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చలో భాగంగా నోడల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….*

#“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” లో భాగంగా పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు ఉన్నాయి.
#ఈ పది సూత్రాలు అమలు ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100% అక్షరాస్యత, మరియు 85 సంవత్సరాల ఆయుర్థాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రధాన లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.

#*జీరో పావర్టీ (Zero Poverty):* ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా P4 మోడల్ (Public–Private–People Partnership) ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించబడిన ఈ పథకం క్రింద బంగారు కుంటుంబాలు, మార్గదర్శిలను గుర్తించేందుకు మార్చి, జూలై లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి 21 లక్షల కుటుంబాలను షార్టులిస్టు చేసి అందులో 10 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1.00 లక్షల మార్గదర్శి ని గుర్తించడం జరిగింది.

#*Family Benefit Management System (FBMS)*లో 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72% డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

#వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి మద్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యే విధంగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ లక్ష్య సాధనలో ఎం.పి.డి.ఓ.లు, మున్సిఫల్ కమిషనర్లు కీలక భూమిక పోషించాలి, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

#GSWS – బంగారు కుటుంబం అనుసంధానం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, మరియు డేటా ఆధారిత పాలనకు దిశానిర్దేశం చేస్తూ స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేస్తోంది.
(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments