Thursday, December 18, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరెవెన్యూ డిజిటలైజేషన్‌లో ఏఐ వినియోగం |

రెవెన్యూ డిజిటలైజేషన్‌లో ఏఐ వినియోగం |

అమరావతి

రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్లో ఏఐ వినియోగంపై ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్.

అనంతపురంలో రెవన్యూ రికార్డులు సరిగ్గా లేకపోవటం, 22 ఏ లాంటి తీవ్రమైన అంశంగా ఉండేదని చెప్పిన అనంత కలెక్టర్.

సర్వేనెంబర్ లైబ్రరీ తయారు చేశామని వివరించిన కలెక్టర్ ఆనంద్.

రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని వివరించిన అనంతపురం కలెక్టర్.

అనంత జిల్లాలో గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రరీ సిద్దంగా ఉందని వెల్లడి.

*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…*

* అన్ని భూ రికార్డులు స్టోరేజ్ లేదా క్లౌడ్ లో ఉంచండి.

* భూ రికార్డులకు సంబంధించిన ఆర్కైవ్స్ ను కూడా మేనేజ్ చేస్తున్నారు.. ఇలాంటి వాటికి చెక్ చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు ఉంది.

* రికార్డులు ఆన్ లైన్ లైబ్రరీలో ఉంచితే మానిప్యులేషన్ కు అవకాశం ఉండదు.

* బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఆలోచన చేసి ప్రతిపాదనలు కోరాం.

* 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసిన వాటిని కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు.

* అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ తరహాలోనే వినూత్న ఆలోచనలు చేయాలి.

* *ఈ ఆరు కాన్సెప్టులూ జిల్లాల్లో గేమ్ ఛేంజర్లు గా మారతాయి.*

* *పూర్తిస్థాయిలో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ను మరింతగా విస్తృతపరిస్తే ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.*

* *ప్రజలకు ఏది కావాలో దాని పైనే కలెక్టర్ల సదస్సులో చర్చ జరుగుతోంది. ఇలాంటి చర్చలు సమావేశాలే కావాల్సింది.*

* వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మరింత వినూత్నంగా ఆలోచనలు చేసి మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ తో రావాలి.

* క్షేత్రస్థాయి నుంచే ఇన్నోవేషన్స్ రావాలి.

* ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలోనూ వినూత్న మార్పు వచ్చింది.

* 10 నిముషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవినీతి లేకుండా పంపిస్తున్నారు ఇది అభినందనీయం.

* ఈ తరహాలో పనిచేస్తే దేశం అంతా మన నుంచే నేర్చుకుంటారు.

* రెవెన్యూ శాఖను, రిజిస్ట్రేషన్ శాఖను అభినందిస్తున్నాను.

* 22ఏ భూముల విషయంలో ఏలూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో చేసిన మోడల్ ను ఇతర ప్రాంతాల్లోనూ చేయండి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments