ప్రచురణార్థం 18-12-2025
ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్భార్ నిదర్శనం
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి పాలన
ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు 43వ డివిజన్ లో ప్రజాదర్బార్
సమస్యలు పరిష్కారం కోసం భారీగా తరలివచ్చిన ప్రజానీకం
విజయవాడ : ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలన కు ప్రజాదర్బార్ నిదర్శనం..ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశ్యంతో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ లో కేదారేశ్వరపేట మసీద్ సెంటర్ 4వ లైన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు గురువారం ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి పశ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ ప్రజాదర్భార్ కి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు తరలిరావటం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం డివిజన్ అధ్యక్షుడు అడ్డూరి కొండలరావు అధ్యక్షతన జరిగింది.
టిడిపి నాయకులు ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కొన్ని అర్జీలను అక్కడిక్కడే పరిష్కరించారు.
ఈ ప్రజా దర్బార్ లో రేషన్ కార్డ్ మ్యాపింగ్, కొత్త రేషన్ కార్డ్, టిడ్కో ఇళ్లు, ఇంటి స్థలాలు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలు, సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఆర్జీలు పెట్టుకున్నారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు ప్రతి వారం పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కో డివిజన్ లో ప్రజాదర్బార్ నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ ప్రజా దర్బార్ లో వచ్చిన ఆర్జీలకు వారం, పదిహేను రోజులలోపు పరిష్కారం చూపించే దిశగా ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయ సిబ్బంది ప్రభుత్వాధికారులతో కలిసి చర్యలు తీసుకుంటారని తెలిపారు. అధిక సంఖ్యలో వచ్చిన ఆర్జీలను పి.జి.ఆర్.ఎస్ ఆన్ లైన్ ద్వారా వివిధ శాఖలకు పంపించటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్యదర్శి ఆకుల తన్వి, టిడిపి సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్చార్జ్ కొట్టేటి హనుమంతురావు, 34వ డివిజన్ బిజెపి అధ్యక్షుడు వెంకటేష్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లాల గ్రంధాలయ చైర్మన్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ (దళితరత్న), గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, రాష్ట్ర నగరాల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, టిడిపి డివిజన్ నాయకులు భూషణ్ , నాయక్, ఐ.టి.డి.పి నియోజకవర్గ నాయకులు చైతన్య, స్రవంతి, భోగవల్లి రమేష్, టిడిపి నియోజకవర్గ నాయకులు డి.ప్రభుదాసు లతో పాటు ప్రభుత్వ శాఖల నుంచి సివిల్ సప్లయ్స్ ఎ.ఎస్.వో, టిడ్కో జె.వో, సచివాలయ సిబ్బంది, పోలీస్ విభాగ సిబ్బంది, హెల్త్ , ఎలక్ట్రిక్ , కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.




