*ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదు: కేంద్ర మంత్రి మురుగన్*
డిజిటల్ వినోదంలో మార్పుల నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.
ఓటీటీలు సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని, వీటికి ప్రత్యేక మూడంచెల నియంత్రణ వ్యవస్థ ఉంటుందని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు.
ఐటీ రూల్స్-2021 ప్రకారం అక్రమ కంటెంట్ నిరోధం, వయస్సు ఆధారిత వర్గీకరణ ఓటీటీల బాధ్యత.
ఫిర్యాదుల పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థ అమల్లో ఉంది.




