మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్134 (ఓల్డ్) డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంపత్ చిత్తారి కాలనీలో పర్యటించి అక్కడి నివాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు తమ అవసరాల ఇబ్బందులను ఆమెకు విన్నవించుకున్నారు.
నిరూపయోగంగా వున్న బోరు మోటారు, అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు స్తంభాలు, పాత బడిన రోడ్డు తమ ప్రధాన సమస్యలు అని తెలియజేశారు.
వెంటనే ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో వున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ ను వేస్తున్న తీరును ఆమె పరిశీలించారు.
ప్రధాన సమస్యలుగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించే దిశగా తాను ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఈ కాలనీ పర్యటనలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో పాటు HMWSSB శేఖర్, సాజిత్, అరుణ్ మరియూ కాలనీ వాసులు పాల్గొన్నారు.
#Sidhumaroju




