Home South Zone Andhra Pradesh కేంద్ర మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ |

కేంద్ర మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ |

0
0

ఢిల్లీ

*కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ*

*దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు*

*దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు.*

*“చిప్ టు షిప్” విజన్‌కు అనుగుణంగా షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని వినతి.*

*దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలి : సీఎం చంద్రబాబు*
• దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ & షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం.
• ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం.
• ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధమైంది.
• నౌక నిర్మాణానికి అనుబంధ MSME యూనిట్లు, కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు.
• ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత.
• దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలని కేంద్రాన్ని కోరిన సీఎం.

*ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం చేయాలి : సీఎం చంద్రబాబు*
• ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి
• మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామన్న సీఎం
• ఫేజ్–1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను రూ.1361.49 కోట్లతో చేపట్టామని వివరించిన ముఖ్యమంత్రి
• జువ్వలదిన్నె హార్బర్‌కు మాత్రమే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడి
• ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని వివరించిన సీఎం
• మిగిలిన మూడు హార్బర్లకు కేంద్ర సాయం ఇంకా అందలేదు.
• ఫేజ్–1 పూర్తి కోసం ఇంకా రూ.440.91 కోట్లు అవసరం ఉంది.
• ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి.
• మొత్తం మీద రూ.590.91 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉందని తెలియజేసిన సీఎం చంద్రబాబు.

NO COMMENTS