సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్….
రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తాను జైలుకి వెళ్లడానికి సిద్ధమని మాట్లాడుతున్నారు.
పిపిపి పద్ధతి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు సత్యకుమార్ భావిస్తున్నట్లుంది.
భూమి, భవనాల నిర్మాణం, వనరులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వమే నిధులు సమకూర్చి, లాభాలు మాత్రమే ప్రైవేటు శక్తులకు వచ్చే ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది.
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో ఖర్చు ప్రభుత్వానిది, ఆదాయం ప్రైవేట్ ది
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కాలేజీల పిపిపికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది.
నిన్న పార్లమెంట్ లో చీకటి రోజు
ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించింది.
మహాత్మాగాంధీకి ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్ఠలున్నాయి.
ఉపాధి హామీ పథకానికి తూట్లు పాడిచెందుకే పేరు మార్పు, సవరణలు
డిసెంబర్ 22న దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది.
ఈ నిరసలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిస్తున్నాం.
ఈ ప్రెస్ మీట్ లో రామకృష్ణతోపాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజలు పాల్గొన్నారు.




