మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ 3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి వచ్చే భక్తులు మరియు సమీప బస్తీ వాసులు ఎన్నో ఏళ్లుగా మంచినీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు . ఇటీవల బస్తీ వాసులు వారి ఇబ్బందిని ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకురావడంతో స్టేట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించి నూతన పవర్ బోర్ వెల్ ను వేయించారు .
శుక్రవారం బస్తీ వాసుల ఆనందోత్సాహాల మధ్య ఎమ్మెల్యే శ్రీగణేష్ నూతన పవర్ బోర్ వెల్ ను ప్రారంభించారు.ఎన్నో ఏళ్ల ఇబ్బందిని తీర్చిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలపడంతో ఎమ్మెల్యే మీ సమస్యలను తీర్చడమే నా బాధ్యత అని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్, ఉత్తరయ్య, జమీల్, వినోద్ , శ్రీనివాస్ గౌడ్, మురళీ,ఈపూరి వినోద్,షణ్ముఘం , మధు,, నాగరాజు , రవి , పరమేష్, లయన్ వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు




